Chiranjeevi: రాజకీయాలకు అతీతంగా ఉంటాను... పిఠాపురానికి ప్రచారం కోసం వెళ్లడం లేదు!: చిరంజీవి

  • పద్మవిభూషణ్ తీసుకున్న అనంతరం హైదరాబాద్ చేరుకున్న చిరంజీవి
  • శంషాబాద్ విమానాశ్రయంలో మెగాస్టార్‌ను పలకరించిన మీడియా ప్రతినిధులు
  • పవన్ కల్యాణ్ కోసం పిఠాపురం వెళుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదని వెల్లడి
  • పవన్ కల్యాణ్ కూడా తనను రావాలని కోరుకోడన్న చిరంజీవి
  • రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్నట్లు చెప్పిన చిరంజీవి
Chiranjeevi talks about politics

తాను రాజకీయాలకు అతీతమని పద్మవిభూషణ్ గ్రహీత మెగాస్టార్ చిరంజీవి అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన నిన్న భారత రెండో అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. ఈరోజు హైదరాబాద్ చేరుకున్న చిరంజీవిని శంషాబాద్ విమానాశ్రయంలో మీడియా పలకరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను రాజకీయాలకు అతీతంగా ఉంటానని చెప్పారు.

తాను తన తమ్ముడు పవన్ కల్యాణ్‌కు మద్దతుగా పిఠాపురం వెళుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పిఠాపురానికి తాను రావాలని కల్యాణ్ కోరుకోడన్నారు. కల్యాణ్ బాబు ఎప్పుడూ బాగుండాలని... జీవితంలో అనుకున్నవి సాధించాలని కోరుకుంటానన్నారు. మా తమ్ముడు రాజకీయంగా ఎదగాలని మా కుటుంబం మనస్ఫూర్తిగా కోరుకుంటోందన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ భారతరత్నకు అర్హులు అన్నారు. కూటమి ప్రభుత్వం వస్తే ఎన్టీఆర్‌కు భారతరత్నపై ఆలోచన చేయాలని కోరారు.  

  • Loading...

More Telugu News